దళిత రక్తం రుచిమరిగిన అగ్ర కుల దురహంకారి ‘బ్రహ్మేశ్వర్ ముఖియా’ హత్య

‘బచర్ ఆఫ్ బీహార్’, స్త్రీలు, పిల్లలతో సహా రెండు వందలకు పైగా దళితులను పాశవికంగా చంపేసిన అగ్రకుల దురహంకారి ‘బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా’ శుక్రవారం ఉదయం హత్యకు గురయ్యాడు. ‘మార్నింగ్ వాక్’ కి వెళ్ళిన ముఖియాను గుర్తు వ్యక్తులు సమీపం నుండి తుపాకితో కాల్చి చంపారని ఎన్.డి.టి.వి తెలిపింది. హత్య జరిగిన ‘అర్రా’ పట్టణం ఇప్పుడు కర్ఫ్యూ నీడన బిక్కు బిక్కు మంటోంది. దశాబ్దానికిపైగా బీహార్ అగ్రకుల భూస్వాముల తరపున రాష్ట్రం అంతటా రక్తపుటేరులు పారించిన ముఖియా…