ముస్లింల దైవ ప్రార్ధనలో క్రమశిక్షణ ఉంటుంది -బక్రీద్ ఫొటోలు
ముస్లిం మతస్ధులు దైవ ప్రార్ధన (నమాజు) చేసేటప్పుడు చాలా క్రమ శిక్షణ కనిపిస్తుంది. మిగత మత ప్రార్ధనలలో ఇది పెద్దగా కనిపించదనుకుంటా. హిందూ పుణ్య క్షేత్రాల వద్ద కోలాహలం కనిపిస్తుంది. తిరుపతి దగ్గర్నుండి ఏ గుడి తీసుకున్నా అంతా కోలాహలం. కానుకలు కూడా కోలాహలమే. ప్రసాదం దగ్గర కూడా. బౌద్ధ మత ప్రార్ధనలు ఎలా ఉంటాయో ఎరుగం. శిక్కుల గురుద్వారాల్లో కూడా కోలాహలం కనిపిస్తుంది. అయితే గురుద్వారాల్లో హిందూ దేవాలయాల్లో కనిపించేటంత కోలాహలం ఉండదు. బహుశా జైన…