బంగ్లా నుండి కోటిమంది హిందువులు ఇండియా వస్తారట!

ఎద్దు ఈనింది అంటే దూడని దొడ్లో కట్టేయమన్నాడట వెనకటికొకరు! పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు, తృణమూల్ కాంగ్రెస్ నుండి బిజెపిలోకి దూకిన టర్న్ కోట్ సువేందు అధికారి చేసిన ప్రకటన ఇలాగే ఏడ్చింది! పత్రికల వార్తల ప్రకారం సువేందు అధికారి “సిద్ధంగా ఉండండి. బంగ్లాదేశ్ నుండి కోటి మంది హిందువులు (పశ్చిమ) బెంగాల్ కు వలస రాబోతున్నారు” అని ప్రకటించాడు. సువేందు అధికారి అంతటితో ఆగలేదు. ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న…

‘అస్సాం హింస’ ముస్లిం మిలిటెన్సీకి దారి తీయవచ్చు -మైనారిటీస్ కమిషన్

అస్సాంలోని బోడో జిల్లాల్లో చెలరేగిన హింసలో ముస్లిం ప్రజల భద్రతకు హామీ లభించకపోతే ‘ముస్లిం మిలిటెన్సీ’ కి దారి తీయవచ్చని ‘నేషనల్ మైనారిటీస్ కమిషన్’  (ఎన్ ఎం సి) హెచ్చరించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోని జీహాదీ సంస్ధల మద్దతుతో అటువంటి మిలిటెన్సీ తలెత్తే అవకాశాలు ఉన్నాయని కమిషన్ తయారు చేసిన నివేదిక హెచ్చరించింది. ‘బోడోలాండ్ టెరిటోరియల్ అటానమస్ డిస్ట్రిక్క్ట్స్’ (బి.టి.ఎ.డి) కింద ఉన్న నాలుగు జిల్లాలను కమిషన్ సందర్శించిన అనంతరం ఈ నివేదిక తయారు చేసిందని ‘ది…