బంగారు లక్ష్మణ్ కి నాలుగేళ్ళు జైలు, జడ్జి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ కోర్టు బి.జె.పి మాజీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి బంగారు లక్ష్మణ్ కి నాలుగేళ్ళు జైలు శిక్ష విధించింది. జరిమానాగా లక్ష రూపాయలు చెల్లించాలని జడ్జి తీర్పు నిచ్చాడు. శిక్ష విధిస్తూ అడిషనల్ సెషన్స్ జడ్జి కన్వల్ జీత్ అరోరా సంచలన వ్యాఖ్యలు చేశాడు. జడ్జి విధించిన శిక్ష, తదనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాపితంగా ఉన్న కోర్టులు పాటించినట్లయితే దాదాపు భారత దేశ నాయకులు, బ్యూరోక్రాట్ అధికారులు అందరూ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే.…

