దొడ్డి దారిన రిటైల్ ఎఫ్.డి.ఐ యోచనలో మోడి ప్రభుత్వం?

బి.జె.పి/నరేంద్ర మోడి ఎన్నికల వాగ్దానాల్లో రిటైల్ ఎఫ్.డి.ఐ ఒకటి. మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను యు.పి.ఏ ప్రభుత్వం అనుమతించగా బి.జె.పి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వస్తే ఈ నిర్ణయాన్ని తిరగదోడతామని బి.జె.పి వాగ్దానం ఇచ్చింది. సదరు వాగ్దానాన్ని నెరవేర్చడం మాట అటుంచి దొడ్డి దారిన యు.పి.ఏ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసే యోచనలో మోడి ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుండి తమకు గట్టి…