ఫ్రాన్స్ లో హింసాత్మక ఆందోళనలు
ఉక్రెయిన్ లో ఆందోళనలను అణచివేస్తున్నారంటూ ఆరోపిస్తున్న అమెరికా, ఐరోపా దేశాలకు ఫ్రాన్స్ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. అధ్యక్షుడు ఫ్రాన్షా ఒలాండేకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ ప్రజలు ఆదివారం ప్యారిస్ వీధుల్లో కదం తొక్కారు. ఒలాండే అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ‘ఆగ్రహ దినం’ పాటిస్తున్నామని ప్రకటించారు. పోలీసులతో వీధి యుద్ధాలకు తలపడ్డారు. పోలీసులు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారని, 250 మంది వరకు అరెస్టు చేశారని పత్రికలు తెలిపాయి. ఆందోళనకారులు కొందరు ఇ.యు నుండి ఫ్రాన్స్ బైటికి రావాలని డిమాండ్ చేయడం…
