ఫ్రాన్సు ఎన్నికల్లో సర్కోజి ఓటమి -యూరోప్ కార్టూన్లు
ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజి ఓటమి పై యూరోపియన్ కార్టూనిస్టులు ఇలా స్పందించారు. యూరోపియన్ బహుళజాతి కంపెనీలతో పాటు అమెరికా బహుళజాతి కంపెనీలకు లబ్ది చేకూరుస్తూ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజీల నేతృత్వంలో యూరోపియన్ ప్రభుత్వాలు అమలు చేసిన పొదుపు ఆర్ధిక విధానాలతో యూరోపియన్ ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. కంపెనీలకు బెయిలౌట్లు పంచిపెట్టడం వల్ల పేరుకున్న అప్పులను కోతలు, రద్దులతో ఇ.యు ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. కార్మికులు, ఉద్యోగుల వేతనాలలో గణనీయ…


