ఆఫ్రికా: ఇద్దరు భారతీయులను కాల్చి చంపిన ఫ్రెంచి సైన్యం
ఆఫ్రికాలో సాగుతున్న సామ్రాజ్యవాద ప్రచ్ఛన్న యుద్ధం ఇద్దరు భారతీయులను బలి తీసుకుంది. ఆఫ్రికా ఖండంలో అంతకంతకూ పెరుగుతూ పోతున్న చైనా వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీయడానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు ప్రత్యక్షంగా తీసుకుంటున్న మిలట్రీ చర్యలకు భారతీయులు మూల్యం చెల్లించవలసి వచ్చింది. ‘సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‘ దేశంలో విమానాశ్రయాన్ని సమీపిస్తున్న మూడు వాహనాల పైకి ఫ్రెంచి సేనలు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు భారతీయులు, ఒక దేశీయుడు చనిపోగా మరొక భారతీయుడు, ఛాద్ పౌరుడు గాయపడ్డారు.…