ఆఫ్ఘన్ ఫ్రెంచి బలగాలన్నీ ముందే ఉపసంహరణ
ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న తమ యుద్ధ బలగం (combat troops) అంతటినీ సంవత్సరం ముందే ఉపసంహరించుకోవడానికి నిర్ణయించినట్లు ఫ్రాన్సు కొత్త అధ్యక్షుడు ‘ఫ్రాంకోయిస్ హాలండే’ ప్రకటించాడు. ఒక రోజు సందర్శన కోసం ఆఫ్ఘనిస్ధాన్ వచ్చిన హాలండే, ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో కలిసి విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశాడు. ఆఫ్ఘన్ నుండి ఫ్రెంచి బలగాల ఉపసంహరణ హాలండే ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి. ఈ వారం చికాగోలో జరిగిన నాటో సమావేశాల్లోనే తన ఉద్దేశ్యం…


