మరింత క్షీణిస్తున్న భారత ఆర్ధిక వృద్ధి, లక్ష్య సిద్ధి అనుమానమే
భారత దేశ ఆర్ధిక వృద్ధి మరింత క్షీణిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రంగాల్లో ఉత్పత్తి పెరుగుదల రేటు తగ్గిపోతుండడంతో జి.డి.పి వృద్ధి రేటు అంచనా వేసిన దానికంటే తక్కువే నమోదు కావచ్చని ప్రభుత్వంలోని ఆర్ధిక సంస్ధలు, పరిశీలకులు భావిస్తున్నారు. దానితో గతంలో విధించుకున్న జిడిపి వృద్ధి రేటు లక్ష్యాన్ని ప్రభుత్వం తగ్గించుకుంటోంది. జి.డి.పి వృద్ధితో పాటు మార్చి 2011 నాటికి చేరాలని భావిస్తున్న బడ్జెట్ లోటు (ఫిస్కల్ డెఫిసిట్), ద్రవ్యోల్బణం తదితర లక్ష్యాలను కూడా ప్రభుత్వం తగ్గించుకుంటోంది.…