దిల్‌షుక్‌నగర్ పేలుళ్లు: ముఖ్యమంత్రి రాకతో సాక్ష్యాలు భంగం
ముఖ్యమంత్రి తదితరుల వి.వి.ఐ.పి ల సందర్శన వలన పోలీసుల పరిశోధన ముందుకు సాగని పరిస్ధితి ఏర్పడింది. వారితో పాటు ఉత్సుకతతో చూడడానికి వచ్చిన జనం పేలుడు జరిగిన చోట్ల ఇష్టం వచ్చినట్లు తొక్కిపారేయడంతో కీలక సాక్ష్యాలు లభ్యం కాకుండా పోయాయి. పేలుడు జరిగాక జనం హాహాకారాలతో అటు ఇటు పరుగులు పెట్టడం సహజమే. కానీ ఆ పరుగులు కూడా కీలక సాక్ష్యాలలో భాగంగా ఉండవచ్చు. వారు కాకుండా బైటివారు రావడం వలన పేలుడు జరిగిన తర్వాత పరిసరాలలో…
