చందోగ్రఫి: లండన్ లో తెలుగుదనం -ఫోటోలు

లండన్, న్యూయార్క్ నగరాల్లో ఓ తెలుగు కుర్రాడు తన కెమెరాలో బంధించిన అద్భుత దృశ్యాలివి. తనను తాను అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ గా పోలేపెద్ది చంద్ర శేఖర్ (ఈ బ్లాగ్ లో వ్యాఖ్య ద్వారా) చెప్పుకున్నారు. కానీ ఆయన తీసిన ఈ ఫోటోలు చూస్తే మాత్రం ఆయన అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ అంటే నమ్మ బుద్ధి అయ్యేలా లేవు. చేయి తిరిగిన (కన్ను తిరిగిన అనాలేమో!) ఫోటోగ్రాఫర్ తీసిన ఫొటోలివి అని చెప్పినా ఇట్టే నమ్మొచ్చు. ఈ ఫొటోల్లో మనుషులు…

రవి గాంచని చోట ఛాయాగ్రాహకుడు గాంచున్

‘రవి గాంచని చోట కవి గాంచున్’ అని పెద్దల మాట! కానీ అది పాత రోజుల్లో. ఫోటోగ్రాఫర్ శక్తి ఏమిటో బహుశా ఆనాటి పెద్దలకు ఇంకా అర్ధం అయి ఉండదు. ఈ మాట చెప్పేనాటికి ఫోటోగ్రఫి ఈ స్ధాయిలో అభివృద్ధి చెందలేదని సరిపెట్టుకుందాం. మానవుడికి అందుబాటులో లేని సుదూర తీరాలకు సైతం కెమెరా కన్ను ఈ రోజు ప్రయాణిస్తోంది. మనిషి కన్ను మహా అయితే భూ కక్ష్య వరకే చూడగలదు. కానీ కెమెరా కన్ను ఇప్పుడు అంగారకుడిని…