ఇండియా వస్తున్న జర్మనీ ఛాన్సలర్ విమానాన్ని గాల్లోనే అడ్డుకున్న ఇరాన్

రక్షణ రంగ కొనుగోళ్ళ విషయం గురించి చర్చించడానికి ఇండియా వస్తున్న జర్మనీ ఛాన్సలర్ విమానాన్ని ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో రెండు గంటలపాటు సదరు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. చివరికి టర్కీ మద్యవర్తిత్వంతో మెత్తబడిన ఇరాన్ జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రయాణిస్తున్న విమానానికి అనుమతి ఇవ్వడంతో ఆమె క్షేమంగా ఇండియా చేరగలిగింది. విమానాన్ని తమ గగన తలం లోకి ఇరాన్ ఎందుకు అనుమతించనిదీ కారణం ఇంకా తెలియలేదు. ఇరాన్…

పాక్‌తో చెలిమి ఇండియాతో ఆయుధ వ్యాపారానికి చేటు -అమెరికా రాయబారి (వికీలీక్స్)

పాకిస్ధాన్‌తో అమెరికాకి ఉన్న స్నేహం వలన ఇండియాతో జరిపే ఆయుధ వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడవచ్చని ఇండియాలోని అమెరికా రాయబారి అమెరికా మిలట్రీ అధికారులను హెచ్చరించిన సంగతి వికీలీక్స్ వెల్లడి చేసిన డిప్లొమాటిక్ కేబుల్స్ ద్వారా బయటపడింది. అమెరికా ఆయుధాల అమ్మకానికి పోటీగా వచ్చే ఇతర దేశాల కంపెనీలు, పాకిస్ధాన్‌తో అమెరికాకి గల స్నేహం గురించి ఇండియాను హెచ్చరించవచ్చనీ, అందువలన కీలకమైన సమయంలో ఇండియాకి అవసరమైన మిలట్రీ విడిభాగాలు, మందుగుండుల సరఫరాను అమెరికా ఆపేయవచ్చని ఇండియాకు నూరిపోయడం ద్వారా…

అమెరికా జెట్‌ఫైటర్ల కొనుగోలుకు ఇండియా తిరస్కరణ, స్నేహం దెబ్బతినే అవకాశం

అమెరికా, యూరప్ దేశాల మధ్య జరిగిన పోటీలో ఎట్టకేలకు అమెరికా ఓడిపోయింది. అమెరికాకి కాంట్రాక్టు ఇవ్వడానికి నిరాకరించడంతో అమెరికాతో ఇండియా సంబంధాలు దెబ్బతినే అవకాశాం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 11 బిలియన్ డాలర్ల (రు.51,000 కోట్లు) విలువతో ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు ఇండియా ఒకటిన్నర సంవత్సరాలనుండి ప్రయత్నిస్తున్నది. గత నవంబరు నెలలో ఒబామా ఇండియా సందర్శించినప్పుడు కూడా ఈ కాంట్రాక్టుపై చర్చలు జరిగాయి. ఒబామా సందర్శించినప్పుడు ఇండియా ఏమీ తేల్చి చెప్పలేదు. కాని అమెరికాకి చెందిన…