ఫేస్ బుక్ లో 10 శాతం మంది తిట్లు తింటున్నారట!

ఫేస్ బుక్ ఖాతాదారుల్లో కనీసం నూటికి పది మంది తిట్లు, అవమానాలు ఎదుర్కొంటున్నారని ఒక అధ్యయనం తెలిపింది. అధ్యయనం ప్రకారం ఫేస్ బుక్ వినియోగదారుల్లో పది శాతం మంది తమ ‘వాల్‘ పైన అభ్యంతరకరమైన, అవమానకరమైన సందేశాలు పోస్ట్ చేయబడిన అనుభవాలు ఎదుర్కొన్నారు. తమకు నచ్చని యూజర్‌లను తిట్టడం, అవమానించడం, వ్యక్తిగతంగా ఎగతాళి చేయడం బూతురాయుళ్ళ పనిగా ఉంటోంది. బెదిరిస్తూ ప్రైవేటు సందేశాలు ఇవ్వడం కూడా వీరి పనుల్లో ఒకటని టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. ఇంకా ఘోరం…

ఫేస్‌బుక్, ట్విట్టర్… లండన్‌లో మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ళు -కార్టూన్

లండన్ పోలీసుల దృష్టిలో ఫేస్ బుక్, ట్విట్టర్ లు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ళు. బ్రిటన్‌లో ప్రజాస్వామ్యం ఉంది అని ప్రపంచం భావిస్తోంది కనుక ఆగారు కానీ ఈ పాటికి ఈ ఇద్దరు నేరగాళ్ళని లండన్ పోలీసులు పబ్లిక్ లో కనపడకుండా చేసేవారే. జోర్డాన్ బ్లాక్‌షా (20 సం.లు), సట్‌క్లిఫ్ కీనన్ (22 సం.లు) అనే ఇద్దరు యువకులకి లండన్ మెజిస్ట్రేట్ కోర్టు నాలుగు సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో సందేశాలు…