ఫుకుషిమా శుభ్రతకు దశాబ్దాలు, అణు పరిశ్రమకు అంతం పలకాలని కోరుతున్న జపాన్

“జపాన్ కాంగ్రెస్ ఎగైనెస్ట్ అటామిక్ అండ్ హైడ్రోజన్ బాంబ్స్” మొదటి సమావేశం, భూకంపం, సునామీల వలన అణు ప్రమాదం సంభవించిన ఫుకుషిమాలో సోమవారం ప్రారంభమయ్యింది. అణు విద్యుత్ పరిశ్రమకు ఇక అంతం పలకాలని ఆ సదస్సు కోరింది. అణు విద్యుత్ కానీ, అణు బాంబులు కానీ ఏవీ వాంఛనీయం కాదనీ రెండూ మానవాళికి ప్రమాదకారులేననీ సమావేశం తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 9 పరిమాణంతో మార్చి 11 న ఫుకుషిమా దైచి అణు ప్లాంటు వద్ద సంభవించిన…

తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టు, ఫుకుషిమా అణు ప్రమాదం, కొన్ని సంగతులు

ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో యురేనియం నిల్వలున్న ప్రాంతంగా పేరు సంపాదించుకున్న తుమ్మలపల్లె గ్రామం కడప జిల్లా పులివెందుల మండలంలో ఉంది. ఇక్కడ 49,000 టన్నుల యురేనియం నిల్వలు ఉన్నాయని నిర్ధారించారని మాత్రమే నిన్నటి వరకూ లోకానికి తెలుసు. అయితే రాజస్ధాన్‌లో, దేశంలోని 25వ అణు విద్యుత్ రియాక్టర్ నిర్మాణానికి శంకుస్ధాపన కోసం విచ్చేసిన భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ, తుమ్మలపల్లెలో గతంలో నిర్ధారించినట్లుగా 49,000 టన్నులు కాకుండా దానికి మూడు రెట్లు, అంటే…