‘తీవ్ర’ ప్రమాద స్ధాయిలో ఫుకుషిమా రేడియేషన్ లీకేజి

జపాన్ ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద రేడియేషన్ కలుషిత నీటి లీకేజి ‘తీవ్ర’ (serious) స్ధాయికి చేరిందని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక లీటర్ నీటిలో రేడియేషన్ కు సాధారణ అనుమతి స్ధాయి 150 బెక్యూరల్స్ కాగా ఫుకుషిమా వద్ద లీటర్ నీటిలో 30 మిలియన్ బెక్యూరల్స్ రేడియేషన్ తో కలుషితం అయిన నీరు నిరంతరం లీక్ అవుతూ సముద్రంలో కలుస్తోంది. అంతర్జాతీయ రేడియేషన్ ప్రమాద స్కేలు పైన దీని తీవ్రతను 3 కు జపాన్ ప్రభుత్వం…