ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ బలహీనపడుతోంది -ఐ.ఎం.ఎఫ్

2008 ఆర్ధిక సంక్షోభం నుండి కోలుకుంటోందని భావిస్తున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ బలహీనపడుతున్నదని ఐ.ఎం.ఎఫ్ తెలిపింది. అమెరికా, యూరప్ దేశాల ప్రభుత్వాల విధానాలు నమ్మకాన్ని పునరుద్ధరించడంలో విఫలం కావడంతో ప్రపంచ ఆర్ధిక వృద్ధి క్షీణ దశలోకి జారిపోయిందని ప్రపంచ ద్రవ్య సంస్ధ తన తాజా నివేదికలో తెలియజేసింది. ఆర్ధిక వ్యవస్ధ మరింతగా క్షీణించే సూచనలు గణనీయంగా ఉన్నాయని కూడా ఐ.ఎం.ఎఫ్ తెలిపింది. 2013 లో ప్రపంచ ఆర్ధిక వృద్ధి రేటు 3.9 శాతం ఉంటుందని గత…

European Union -Tracks never meet

యూరోపియన్ యూనియన్, యూరోజోన్: ఎన్నడూ కలవలేని పట్టాలు -కార్టూన్

యూరోపియన్ యూనియన్ ఎదుర్కొంటున్న రుణ సంక్షోభం ఎలా పరిష్కారం చేసుకోవాలో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్న పరిస్ధితిని ఈ కార్టూన్ సూచిస్తోంది. యూరోపియన్ యూనియన్ (ఇ.యు) దాని సభ్య దేశాల మధ్య రాజకీయ ఐక్యతను సూచించే సంస్ధ కాగా, యూరో జోన్ (ఇ.జెడ్) సంస్ధ దాని సభ్య దేశాల కోశాగార ఐక్యత (ఫిస్కల్ యూనిటీ) ని సూచించే సంస్ధ. ఇ.యులో 27 సభ దేశాలు ఉన్నాయి. వీటిలో 17 దేశాలు మాత్రమే ‘యూరో’ ను తమ ఉమ్మడి…