ఆర్.బి.ఐ ఆశ్చర్యకర వడ్డీ కోత! -ది హిందు
మార్కెట్లను ఆశ్చర్యంలో ముంచెత్తగల సామర్ధ్యం సెంట్రల్ బ్యాంకింగ్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్, గురువారం నాడు వడ్డీ రేట్లను 0.25 శాతం మేర తగ్గించడం ద్వారా దానిని కనబరిచారు. గత వారం రోజుల్లో ద్రవ్యోల్బణము, పారిశ్రామిక ఉత్పత్తిలకు సంబంధించి సానుకూల ఆర్ధిక ఫలితాలు వెలువడడంతో వడ్డీ తగ్గింపు ఉంటుందని అంచనా వేశారు. అలాంటి తగ్గింపు ఏదన్నా ఉన్నట్లయితే అది ఫిబ్రవరి 3 వ తేదీ నాటి ద్వైమాస విత్త విధాన సమీక్షలో…



