సబ్సిడీ సిలిండర్ల పెంపు, విషం కక్కుతున్న పరిశ్రమ వర్గాలు

సబ్సిడీ సిలిండర్ల సంఖ్య పెంచడం తిరోగామి చర్య అని ఫిక్కి అధ్యక్షుడు సిద్ధార్ధ్ బిర్లా జారీ చేసిన ప్రకటనలో అభివర్ణించాడు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కూడా ఈ చర్య భారం అవుతుందని ఆయన చాలా బాధపడిపోయాడు. ఆధార్ కార్డు తో ఎల్.పి.జి సిలిండర్ కు పెట్టిన సంబంధం తెంచడం వలనా, సబ్సీడీ సిలిండర్లు పెంచడం వలనా దేశానికి ఆర్ధిక కష్టాలు పెరుగుతాయని, కోశాగార క్రమశిక్షణ (Fiscal descipline) మరియు కోశాగార సమతూకం (Fiscal balance) పాటించాల్సి ఉండగా…