ఫాలక్ తల్లి మున్నీని కాపాడిన పోలీసులు, తల్లిని చేరనున్న ఫాలక్
వళ్లంతా కొరికిన గాయాలతో, ఎముకలు విరికిన చేతులు కాళ్ళతో, గాయపడిన మెదడుతో ఢిల్లీలోని ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న రెండేళ్ల ‘ఫాలక్’ తల్లి ‘మున్నీ ఖాటూన్’ ను ఢిల్లీ పోలీసులు రాజస్ధాన్ వ్యభిచార గృహం నుండి రెండు రోజుల క్రితం రక్షించారు. మున్నీ పెద్ద కూతురు మూడేళ్ల పాపను కూడా కాపాడిన పోలీసులు తల్లీ కూతుళ్లను ఒక చోటకి చేర్చగలిగారు. అయితే మున్నీ, తన చిన్న కూతురు ఫాలక్ ను మాత్రం ఇంకా కలవ వలసి ఉంది.…

