గుజరాత్ నరమేధంపై అమెరికా కాంగ్రెస్ తీర్మానం సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే

గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడి ప్రత్యక్ష పర్యవేక్షణలో ముస్లిం లపై సాగిన దారుణ నరమేధం జరిగి దశాబ్దం పూర్తయిన సందర్భంగా అమెరికా ప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. గుజరాత్ రాష్ట్రంలో అన్నీ మతాల వారూ మత స్వేచ్చతో బతికే సుహృద్భావ పూరిత వాతావరణం కల్పించాలని గుజరాత్ లోని నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని ఆ తీర్మానం కోరింది. 2002 నాటి ‘ముస్లింల హత్యాకాండ’లో బాధితులైన వారికి నరేంద్ర మోడి ప్రభుత్వం సరైన న్యాయం కల్పించేందుకు ఎటువంటి…