ముస్లింల వ్యతిరేకి వి ఎస్ నైపాల్ కి అవార్డా! ఎందుకు? -గిరీష్ కర్నాడ్ -2
మొదటిభాగం తరువాయి… ఇపుడు మళ్ళీ ఆయన చెప్పేదేమిటో ఊహించదగినదే. అదేమంటే, ముస్లింలు భారతీయ ఆర్కిటెక్చర్ ను నాశనం చేశారు; ప్రతీదీ కూలిపోయింది. వారు దోపిడీదారులు మరియు వినాశనకారులు. ముస్లింల హయాంలో ఏమి జరిగిందో తెలియాలంటే ఏ భవనాన్నైనా చూడవచ్చు. జనం ఆయనతో వాదించినపుడు ఆయన తాజ్ గురించి ఏమాన్నాడో చూడండి: “తాజ్ అనేది పెద్ద వృధా, క్షీణదశలో ఉన్నది. చివరికది ఎంత క్రూరమైనదంటే అక్కడ ఎక్కువసేపు ఉండడం నాకు చాలా కష్టంగా తోచింది. ప్రజల రక్తం గురించి…
