ప్రియాంక పిల్లల ఇన్స్టా హ్యాకింగ్ చేసిన ప్రభుత్వం?

ప్రియాంక గాంధీ వాద్ర ఈ రోజు (డిసెంబర్ 21, 2021) ఒక నమ్మశక్యం కానీ విషయాన్ని వెల్లడి చేశారు. ఆమె పిల్లల ఇన్స్టాగ్రాం ఖాతాలను ప్రభుత్వం హ్యాక్ చేసిందట! ఇది నిజంగా నిజమేనా?! ఇది నిజమే అయితే బహుశా అంతకంటే దరిద్రమైన ఆరోపణ మోడి ప్రభుత్వం ఇక ఎదుర్కోబోదేమో! ప్రియాంక గాంధీకి ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు రైహన్ వాద్రా, వయసు 20 సం.లు. అమ్మాయి పేరు మిరాయ వాద్రా, వయసు…

కాంగ్రెస్ నాయకత్వ సంక్షోభ పరిష్కర్త ఎవరు? -కార్టూన్

ఇంకెవరు, రాజవంశమే. దృతరాష్ట్రుడు గుడ్డివాడయినందుకు ఆయన్ని సింహాసనానికి దూరం చేశారా? పోనీ జనంలో ఇంకా ఎవరన్నా ఉద్దండుడు ఉన్నారా అని వెతికారా? లేదు కదా! ఆయన తమ్ముడు పాండు రాజుచేత బాధ్యతలు నిర్వర్తింపజేస్తూ ఆ గుడ్డాయన్నే కుర్చీలో కూర్చోబెట్టారు. సో కాల్డ్ ప్రజాస్వామ్యం లోనూ అదే తంతు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో రాజకీయ పార్టీలకు నాయకత్వం ఎక్కడి నుండి వస్తుంది? కార్యకర్తల నుండే రావాలి. కింది స్ధాయి నుండి సంస్ధాగత ఎన్నికలు జరిపించాలి. ఆ ఎన్నికల్లో నెగ్గిన వారిలోనుండి…