తమిళనాట తెలుగు కోసం పోరుతున్న స.వెం.రమేష్

ప్రళయ కావేరి కధల రచయిత సన్నాడి వెంకట రమేష్ ఉరఫ్ స.వెం.రమేష్ 18 సంవత్సరాల వయసు వరకు తెలుగు రాసి ఎరగరు. మద్రాసులో పి.జి వరకు ఆంగ్ల మాధ్యమం లోనే చదువుకున్న రమేష్ తెలుగులో కధలు రాసే స్ధాయికి ఎదగడమే అద్భుతం అయితే, ఆ కధలను వేలాది పల్లె పదాలతో నింపడం ఇంకో అద్భుతం. పులికాట్ సరస్సు వద్ద ఉన్న తమ తాత, ముత్తాతల గ్రామాలకు వచ్చి అక్కడి పద సంపదను చూసి అచ్చెరువు పొంది పట్టుబట్టి…