అమెరికా: ఋణ పరిమితి చర్చలు మళ్ళీ విఫలం
అమెరికాలో ఋణ పరిమితి చర్చలు మళ్ళీ పతనం అయ్యాయి. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ నాయకులు ప్రతిపాదించిన బిల్లుకు ఆ పార్టీ సభ్యల్లోనే మద్దతు కొరవడడంతో అది సభలోకి ప్రవేశించకముందే ఉపసంహరించుకున్నారు. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వవద్దని కన్సర్వేటివ్ గ్రూపులు కోచ్ బ్రదర్స్, టీ పార్టీలు ప్రచారం చేయడంతో ప్రతినిధుల సభలో రిపబ్లికన్ నేత, స్పీకర్ జాన్ బోయ్ నర్ ప్రయత్నాలు వమ్ము అయ్యాయి. దానితో అమెరికా పరపతి రేటింగును తగ్గించాల్సి ఉంటుందని ఫిచ్ ఋణ రేటింగు సంస్ధ…


