శ్రీలంకతో ఎన్నికల యుద్ధం ప్రాక్టీస్ -కార్టూన్
శ్రీలంక తమిళుల దుర్భర పరిస్ధితులపై తమిళనాడులో అక్కడి రాజకీయ పార్టీలు భావోద్వేగాలు రెచ్చగొట్టి పెట్టాయి. శ్రీలంక ప్రభుత్వం సాగించిన యుద్ధ నేరాలపై అమెరికా ఐరాస మానవ హక్కుల తీర్మానం ప్రతిపాదించడం పార్టీలకు వాటంగా కలిసి వచ్చింది. యుపిఎ ప్రభుత్వానికి డిఎంకె మద్దతు ఉపసంహరించుకోవడంతో పార్టీల నాటకం రక్తి కట్టింది. ఐ.పి.ఎల్ ఆటలకు శ్రీలంక ఆటగాళ్లను అనుమతించేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి హుంకరించడంతో రక్తి కట్టిన నాటకం కాస్తా రసాభాసగా మారిపోయింది. ప్రత్యేక తమిళ ఈలం కోసం సాయుధంగా…