కానరాని రికవరీ, ప్రపంచ జి.డి.పి తెగ్గోసిన ఐ.ఎం.ఎఫ్
2007-2009 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం నుండి ప్రపంచం ఇంకా బైటపడలేదని అది వాస్తవానికి నిరంతర సంక్షోభంలో తీసుకుంటోందని మార్క్సిస్టు-లెనినిస్టు విశ్లేషకులు చెప్పిన మాటలను సాక్ష్యాత్తు ఐ.ఎం.ఎఫ్ ధ్రువపరిచింది. అలవిమాలిన ఆర్ధిక ఉద్దీపనలు ప్రకటిస్తూ, అమలు చేస్తూ ప్రపంచాన్ని మాంద్యం నుండి బైటికి తేవడానికి మార్కెట్ ఎకానమీ దేశాలు, సో కాల్డ్ అభివృద్ధి చెందిన దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆర్ధిక పరిస్ధితులు లొంగిరామంటున్నాయి. మంగళవారం ఐ.ఎం.ఎఫ్ వెలువరించిన ‘వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్’ పత్రం అనేక…
