ప్రధాని జర్మనీ పర్యటన, ఏ రోటి కాడ ఆ పాట!
భారత ప్రధాని మన్మోహన్ ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జర్మనీ కంపెనీలు ఆతృతగా ఎదురు చూడగా అది పెద్దగా ముందుకు సాగలేదని తెలుస్తోంది. ఆరు వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని ప్రకటించాయి. సోలార్ ఎనర్జీ లాంటి సాంప్రదాయేతర ఇంధన టెక్నాలజి, విద్య, వ్యవసాయం తదితర రంగాలలో ఈ ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. ఆరేళ్లలో ఒక బిలియన్ యూరోలు రుణం ఇస్తామని హామీ ఇచ్చారుట. జర్మనీ కార్ల దిగుమతులపై అధిక పన్నులు వేయడం పట్ల…

