ప్రవేశపెడ్తున్నాం, మోడి ఫిడేల్ సింఫొనీ -కార్టూన్

బి.జె.పి ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడిని ప్రకటించే రోజు ‘ఇదిగో ఈ రోజే’ అనీ, ‘కాదు, కాదు రేపే’ అనీ పత్రికలు, ఛానెళ్లు ఒకటే రచ్చ! కానీ ఆ రోజు మాత్రం రావడం లేదు. సెప్టెంబరు 17 లోపు ప్రకటిస్తారని తాజాగా పత్రికల కధనం. కానీ అద్వానీని మె(ఒ)ప్పించడమే బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ సంస్ధలకు మహా కష్టం అయిందని వార్తలు చెబుతున్నాయి. ఆర్.ఎస్.ఎస్ పనుపున, ఆర్.ఎస్.ఎస్ రాయబారిగా మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ అద్వానితో చర్చలు జరపడం ఒకసారి…

కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి -కార్టూన్

భారతీయ జనతా పార్టీ తమ ప్రధాని అభ్యర్ధి ఎవరో చేప్పలేదు. తాము ఇంకా నిర్ణయించుకోలేదని బి.జె.పి అధ్యక్షుడు చెబుతున్నప్పటికీ ఇతర నాయకులు మాత్రం నరేంద్ర మోడియే ప్రధాని అభ్యర్ధి అని బహిరంగంగానే చెబుతున్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు నరేంద్ర మోడి అని చెప్పని నాయకుడు బి.జె.పిలో లేరు. హైద్రాబాద్ లో న.మో సభ పెట్టి దానికి రు. 5/- టికెట్ పెట్టే వరకూ బి.జె.పి నాయకులు వెళ్లారు. అదేమంటే ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయం…