కుదంకుళం అణు కర్మాగారం, ప్రధాన మంత్రిపై పరువు నష్టం దావా
రష్యా సహకారంతో మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకున్న కుదంకుళం అణు విద్యుత్ కర్మాగారంపై పోరాటం చేస్తున్న ఎన్.జి.ఓ (నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) సంస్ధలకు అమెరికా, స్కాండినేవియా దేశాల నుండి డబ్బు ముడుతోందంటూ వ్యాఖ్యానించిన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పై ‘పరువు నష్టం’ దావా వేయడానికి ఉద్యమ నాయకుడు ఉదయ కుమార్ సిద్ధమవుతున్నాడు. తమకు ఏ దేశం నుండీ నిధులు అందడం లేదనీ, ఆమేరకు ప్రధాని చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితంగా ఉన్నాయనీ ఉదయకుమార్ ఆరోపిస్తున్నాడు. అణు విద్యుత్…
