పౌరసమాజ నాయకులను ఐక్యం చేసిన రామ్‌దేవ్ అరెస్టు, లాఠీ ఛార్జీ
ఆదివారం వేకువ ఝామున బాబా రాందేవ్ ఆమరణ నిరాహార దీక్షా శిబిరంపై పోలీసులు దాడి చేయడమే కాకుండా, టియర్ గ్యాసు ప్రయోగించి, లాఠీ ఛార్జీ కూడా చేయడంతో అప్పటివరకు వివిధ కారణాలతో ఎడమొగం పెడమొగం గా ఉన్న పౌర సమాజ నాయకులుగా మన్ననలు అందుకుంటున్నవారిని ఏకం చేసింది. రాం దేవ్ దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి ముప్ఫై మందిక పైగా కార్యకర్తలను గాయపరచడాన్ని అన్నా హజారే, అరుణా రాయ్, కేజ్రివాల్ తదితరులు తీవ్రంగా ఖండించారు. కనీసం నిరసన…