మోడి: జపాన్ షరతులతో అణు ఒప్పందం వాయిదా
భారత ప్రధాని నరేంద్ర మోడి జపాన్ పర్యటనలో ఇండియా-జపాన్ ల మధ్య చరిత్రాత్మక అణు ఒప్పందం ఆమోదం పొందుతుందని పలువురు భావించారు. అందుకే ప్రపంచ అణు పరిశ్రమతో వివిధ రకాలుగా సంబంధం ఉన్నవారందరూ మోడి పర్యటనను ఆసక్తిగా, ఆశగా, భయంగా, ఆందోళనగా తిలకించారు. చివరికి ఒప్పందం కుదరకపోవడంతో పరిశ్రమ వర్గాలు తమ తమ స్ధానాలను బట్టి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ నిట్టూర్చగా ప్రజల తరపున ఆలోచించేవారు ‘పోనీలెమ్మ’ని ఊపిరి పీల్చుకున్నారు. ఒప్పందం కుదరకపోవడానికి కారణం జపాన్ విధించిన విషమ…
