పోస్టాఫీసులు రద్దు చేసి బ్యాంకులు నెలకొల్పుతాం -కపిల్ సిబాల్
దేశ వ్యాపితంగా ఉన్న 1.5 లక్షల పోస్టాఫిసులపై ప్రవేటీకరణ మంత్రుల కన్నుపడింది. ప్రభుత్వంలో ప్రవేటీకరణ కోసం, నూతన ఆర్ధిక విధానాలను వేగంగా అమలు చేయడం కోసం ప్రత్యేకంగా కొంతమంది మంత్రులను ప్రధాని మన్మోహన్ నియమించుకున్నాడు. వారిలో కపిల్ సిబాల్ ఒకరు. ఈయన పూర్వాశ్రమంలో సుప్రీం కోర్టులో పేరు మోసిన న్యాయవాది. అమెరికా పాలకులకు ఇష్టుడు. 2జి కుంభకోణం వలన ప్రభుత్వానికి రు.176,000 కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని భారత అత్యున్నత ఆడిటింగ్ సంస్ధ చెప్పగా, కపిల్ సిబాల్…