‘పోస్కో’ పర్యావరణ అనుమతిని సస్పెండ్ చేసిన గ్రీన్ ట్రిబ్యునల్

ఒరిస్సా గిరిజన గ్రామాలు, అడవులకు తీవ్ర నష్టాన్ని కలిగించే పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ కి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన అనుమతిని గ్రీన్ ట్రిబ్యూనల్ సస్పెండ్ చేసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఫ్యాక్టరీ పూర్తి సామర్ధ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అనుమతి ఇచ్చిందనీ, ఫ్యాక్టరీ పూర్తి సామర్ధ్యం మేరకు పని చేసినపుడు కలిగే నష్టాలను అది సమీక్షించలేదనీ చెబుతూ, మళ్ళీ తాజాగా సమీక్ష జరిగేవరకూ అనుమతిని సస్పెన్షన్ లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. జస్టిస్ సి.వి.రాములు, జస్టిస్…

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ విదేశీ ప్రయాణాల ఖర్చు రు.205 కోట్లు

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జులై 2007 లో పదవిలోకి వచ్చినప్పటి నుండి తన విదేశీ ప్రయాణాల కోసం రు.205 కోట్లను నీళ్లలా ఖర్చు పెట్టేసింది. 12 సార్లు విదేశీ ప్రయాణాలు చేసిన ప్రతిభా 22 దేశాలను చుట్టి వచ్చిందని ప్రభుత్వం వెల్లడించిన వివరాలు చెబుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఆమె పదవీ కాలం ముగుస్తున్నప్పటికీ త్వరలో దక్షిణాఫ్రికా బయలుదేరనున్నారని తెలుస్తోంది. రాష్ట్రపతి చేసే ప్రతి విదేశీ ప్రయాణంలోనూ కుటుంబ సభ్యులందరూ వెంట వెళ్ళేవారని తెలుస్తోంది. గత రాష్ట్రపతులెవరూ…

“న్యాయం కోసం నేలపై పడుకున్నాం,” పిల్లలు చూపుతున్న పోరు దారి -ఫోటోలు

పోస్కో: దక్షిణ కొరియాకి చెందిన బహుళజాతి సంస్ధ. ఐదేళ్ళనుండి ఒడిషాలోని ఐదు గ్రామాల ప్రజల బతుకులపై కొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముడుపులు మెక్కి కొందరు, ప్రపంచ పెట్టుబడికి సలాం కొట్టి మరికొందరు, భారత పాలకులే ఈ ప్రజల పాలిట యమదూత లయ్యారు. తమలపాకు తోటలపై ఆధారపడి కుంటుతూనే గడుపుతున్న వీరి జీవితాల్లోకి విషం పోశారు. రు.50,000 కోట్ల విదేశీ పెట్టుబడికి సలాం కొట్టిన మన్మోహన్, నవీన్‌లు  తమకు ఓట్లేసిన గ్రామీణుల నోట్లో మట్టి కొట్టారు. తమలపాకు తోటల్ని…

పోస్కో (POSCO) కంపెనీ కోసం ప్రభుత్వాల పచ్చి అబద్ధాలు, అరాచకాలు

పోస్కో కంపెనీ ప్రాజెక్టు: ఇది దక్షిణ కొరియాకి చెందిన బహుళజాతి కంపెనీ. భారత దేశంలో సంవత్సరానికి నాలుగు మిలియన్ టన్నుల ఉక్కుని ఉత్పత్తి చేస్తానని 2005 లో భారత దేశంలో ఒప్పందం కుదుర్చుకుంది. 12 బిలియన్ డాలర్ల (రు. 52,000 కోట్లు) పెట్టుబడి ఈ ప్రాజెక్టు రూపంలో ఇండియాకి వస్తుంది. ఇండియాకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకే కంపెనీకి ఇంత పెట్టుబడి మరి దేనికీ రాలేదు. ప్రాజెక్టు కట్టడం కోసం ఇది ఒడిషాలోని జగత్‌సింగ్ పూర్…

పోస్కో వ్యతిరేక ఆందోళన తీవ్రతరం, పిల్లలు మహిళలతో మూడంచెల ప్రతిఘటన వ్యూహం

ఒడిషాలొని జగత్‌సింగ్ పూర్ జిల్లాలో పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ కోసం బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటం కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 24 ప్లాటూన్ల పోలీసు బలగాలను దించి ధింకియా, గోవింద్ పూర్ గ్రామాలను బహుళజాతి ఉక్కు కంపెనీ కోసం వశం చేసుకోవడానికి ప్రయత్నాలను తీవ్ర్రం చేసింది. దాదాపు 3000 ఎకరాల్లోని అటవీ భూముల్ని పోస్కోకి కట్టబెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చేశాయి. ఈ భూముల్లోని అడవులపైనే అక్కడ ఉన్న…

భూములు దక్కించుకోడానికి పోలీసులతో అమీ తుమీకి సిద్ధమైన పోస్కో బాధితులు

దక్షిణ కొరియాకి చెందిన పోస్కో కంపెనీకి ఒడిషాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడానికి పర్యావరణ సమస్యలన్నింటినీ పక్కకు నెట్టి కేంద్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం అనుమతి మంజూరు చేసింది. వాస్తవానికి పోస్కో ప్రాజెక్టు వలన పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని స్వయంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖే గతంలో అనుమతిని నిరాకరించింది. ఐదు సంవత్సరాలనుండి ఈ కంపెనీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అనుమతిని సంపాదించింది. పర్యావరణ మంత్రి జైరాం రమేష్, ప్రధాని మన్మోహన్ ఒత్తిడి…