‘కట్నపిశాచి’ వద్దకి రానందని మహిళను చితక బాదిన పోలీసులు

పోలీసు గూండాయిజానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. భర్త కట్న దాహాన్ని తీర్చలేక ప్రొఫెసర్ ని శరణు వేడిన మహిళను పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లి కట్న పిశాచికి అప్పగించడానికి ప్రయత్నించారు. మహిళను తీసుకెళ్లడానికి మహిళా పోలీసులను వినియోగించాలన్న చట్టాన్ని ఘోరంగా ఉల్లంఘించారు. రాష్ట్ర సరిహద్దుని దాటి మరీ పైశాచికత్వం ప్రదర్షించారు. తమ ఆధీనంలో ఉన్న మహిళను కొడుతున్నప్పటికీ మౌన ప్రేక్షకులుగా మిగిలినందుకు, స్ధానిక జిల్లా ఎస్.పి, ఒక ఎస్.ఐ తో సహా నలుగురు పోలీసులను సస్పెండ్ చేశాడు. మహిళ…