తీవ్రమవుతున్న యూరప్ అప్పు సంక్షోభం, పోర్చుగల్ రేటింగ్ ఢమాల్
గత సంవత్సరం రెండో అర్ధ భాగం అంతా ప్రపంచ కేపిటల్ మార్కెట్లను వణికించిన యూరప్ అప్పు సంక్షోభం మళ్ళీ మరొకసారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత మే, జూన్ నెలల్లో గ్రీసు సంక్షోభమే ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్లను ఆవరించింది. గ్రీసుకు రెండో బెయిలౌట్ ఇవ్వడానికి ఇ.యు ఒక ఒప్పందానికి రావడమూ, గ్రీసు తాజాగా సరికొత్త పొదుపు చర్యలను అమలు చేసే బిల్లును ఆమోదించడమూ విజయవంతంగా ముగియడంతో గ్రీసు తాత్కాలికంగా చర్చలనుండి పక్కకు తప్పుకుంది. తాజాగా మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్…