తెలంగాణవాదుల మిలియన్ మార్చ్ ఆపటానికి ముందస్తు అరెస్టులు

మార్చి 10 తేదీన తెలంగాణ పొలిటికల్ జెఏసి తలపెట్టిన “మిలియన్ మార్చ్” ను అడ్డుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టులు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది. తెలంగాణ ప్రాంతం అంతటా ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను లక్షమందికి పైగా ముందస్తుగా అరెస్టు చేశారని పొలిటికల్ జె.ఎ.సి ఛైర్మన్ కోదండరాం తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ఉంటుందనీ, రాజకీయ ఆకాంక్ష తెలపటానికి…