తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతం, ఇక కాంగ్రెసే టార్గెట్

తెలంగాణ పొలిటికల్ జె.ఎ.సి సారధ్యసంఘం సమావేశం సుదీర్ఘ చర్చల అనంతరం సోమవారం రాత్రి పది గంటల సమయంలో ముగిసింది. సి.పి.ఐ (ఎం.ఎల్ – న్యూడెమొక్రసీ) రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్ లో ఈ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం తెరాస, న్యూడెమొక్రసీ, ఉద్యోగ జె.ఎ.సి ప్రతినిధులు పత్రికలతో మాట్లాడారు. పొలిటికల్ జె.ఎ.సి కన్వీనర్ కోదండరాం మాట్లాడుతూ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు ఏ మాత్రం స్పందించకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణ తరపున మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులను,…