మంత్రి కన్నా గారూ! మంత్రి పదవులకి బోలెడుమంది రెడీ
“బిజినెస్ రూల్స్ ప్రకారమే జి.ఒ లు జారీ చేశాం. ఈ జి.ఒ లని తప్పు పడితే భవిష్యత్తులో ఎవరూ మంత్రి పదవి చేపట్టరు.” (టి.వి 5) ఈ మాటలన్నది రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ. జగన్ అవినీతి కేసులో తమకి సుప్రీం కోర్టు జారీ చేసిన నోటీసుల వల్ల భవిష్యత్తులో మంత్రి పదవులు నిర్వహించడానికి ఎవరూ ముదుకు రారేమోనని మంత్రిగారికి అర్జెంటుగా భయం పట్టుకుంది. కోర్టులు ఇలాగే అవినీతి పేరుతో మంత్రులకి నోటీసులు ఇస్తూ భయపెడుతుంటే…
