చద్దన్నం తినటం వొంటికి ఆరోగ్యమేనా?
మన తండ్రులు తాతలు ఉదయాన్నే లేచి చద్దన్నం తినేవాళ్ళు. మన చేత కూడా తినిపించే వాళ్ళు. పట్టణాల్లో కాదు గానీ పల్లెల్లో వ్యవసాయ కూలీల కుటుంబాల్లో, పేద-మధ్య తరగతి రైతు కుటుంబాల్లో ఇది ఎక్కువగా జరిగేది. బహుశా పట్టణాల్లో ఫ్యాక్టరీల కార్మికుల కుటుంబాల్లో కూడా ఇది జరిగి ఉండవచ్చు. మా అమ్మ నాన్న ఇద్దరూ టీచర్స్. అయినా రాత్రి వండిన అన్నం మిగిలి పోతే ఉదయాన్నే మా చేత చద్దన్నం తినిపించే వాళ్ళు. ముఖ్యంగా వేసవి కాలం…

