నానా జాతుల సంస్కృతుల ప్రతిబింబాలు ఈ పెళ్ళిళ్ళు -ఫోటోలు
ఒక జాతి సంస్కృతిని ప్రతిబింబించే అంశాల్లో ముఖ్యమైనది పెళ్లి. చరిత్రలో కుటుంబ జీవనం స్ధిరపడ్డాక పెళ్లి వేడుకలకు ఎనలేని ప్రాముఖ్యత పెరిగిపోయింది. కాల క్రమంలో సంఘంలో హోదాను, ఆస్తుల గొప్పతనాన్నీ చూపుకోవడానికి పెళ్లి కూడా ఒక సాధనంగా మారినా, వివాహం యొక్క సాంస్కృతిక ప్రాధాన్యత మాత్రం పెరిగిందే గానీ తగ్గిపోలేదు. పెళ్ళిళ్ళు ఆడంబరాలకు వేదికలుగా మారి ఖరీదు పెరిగిపోవడం ఒక విపరిణామం. దానివల్ల మెజారిటీ పేద వర్గాలకు అవి అందుబాటులో లేకుండా పోయాయి. పెళ్లి అంటేనే ఒక…
