పెట్రోల్ వాతలు ఈ వారంలోనే -కార్టూన్
పెట్రోల్, డీజెల్ ధరలు మళ్ళీ వార్తలకు ఎక్కుతున్నాయి. ‘ఇప్పటికయితే పెంచే ఉద్దేశ్యం ఏమీ లేదు’ అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి రెండు రోజుల క్రితం అన్నాడని పత్రికలు చెప్పాయి. మళ్ళీ అదే నోటితో “అత్యవసరం అయినపుడు కఠిన నిర్ణయాలు తప్పవు. ఎంత బాధ ఉన్నా సరే” అన్నాడాయన. వచ్చే వారం పెట్రోల్, డీజెల్, కిరోసిన్, గ్యాస్ ల ధరలన్నీ పెరిగే అవకాశం ఉందని మరుసటి రోజే ‘ది పత్రిక’ తెలిపింది. ఎంతో బాధ…


