నవంబరు 16 నుండి పెట్రోల్ ధర తగ్గుతుందట!!!
అవును. అనుమానం లేదు. మీరు చదివింది నిజమే. పెట్రోల్ ధరలు నవంబరు 16 తేదీ నుండి తగ్గించడానికి ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఆ మేరకు రాయిటర్స్ సంస్ధ ఓ వార్త ప్రచురించింది. తగ్గించడం అంటూ జరిగితే దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా తగ్గించినట్లు అవుతుంది. అంతేకాక, పెట్రోల్ రేట్లపై నియంత్రణ ఎత్తేసిన 18 నెలల తర్వాత మొదటిసారిగా తగ్గించినట్లు అవుతుంది. నియంత్రణ ఎత్తివేసేటప్పుడు ఏం చెప్పారంటే అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగినప్పుడు దేశీయంగా పెట్రోల్…