నార్వేలో కొడుకుని కొట్టి జైలుపాలయిన తెలుగు అమ్మా నాన్నలు
రెండు సామాజిక వ్యవస్ధల కుటుంబ విలువల మధ్య ఉన్న వైరుధ్యాలు ఒక యువ తెలుగు విద్యాధిక జంటను జైలుపాలు చేశాయి. ప్రఖ్యాత భారత సాఫ్ట్ వేర్ సేవల కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ ఉద్యోగి చంద్ర శేఖర్, కంపెనీ కోసం నార్వే వెళ్ళి ఊహించని పరిణామాల వల్ల క్షోభను అనుభవిస్తున్నాడు. ఎదుగుదల క్రమంలో నేర్చుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటున్న 7 యేళ్ళ కుమారుడిని అదుపులో పెట్టే క్రమంలో చంద్రశేఖర్ తండ్రిగా అదుపు తప్పాడని నార్వే కోర్టులు భావించి 18…

