ప్రధాని సేవ ప్రజలకు కాదు, ప్రభు వర్గాలకు -కార్టూన్

మంత్రి: దయచేసి అలాంటి దాడులు చేయకుండా సంయమనం పాటించండి. మన దేశ పెట్టుబడి వాతావరణానికి అది నష్టకరం- గౌరవనీయులైన పారిశ్రామికవేత్తలను గాయపరిస్తే… ప్రధాని: ?! ——————————— ప్రధాన మంత్రి మన్మోహన్ గారికి ప్రభుత్వం లోనూ, కాంగ్రెస్ లోనూ ఉన్న గౌరవం ఏపాటిదో వివరించే ఉదాహరణలు కోకొల్లలు. సోనియా గాంధీ విదేశీయత ప్రధాని పదవికి అడ్డు రావడం, పి.వి.నరసింహారావు ఏలుబడిలో భారత దళారీ పెట్టుబడిదారులకు, విదేశీ సామ్రాజ్యవాదులకు నమ్మకంగా సేవలు చేయడం ద్వారా సాధించిన పలుకుబడి అచ్చిరావడంతో దేశ…

పెట్టుబడిదారీ సంక్షోభ పరిష్కారం అంటే ప్రజల గోళ్ళూడగొట్టడమే -కార్టూన్

పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభాలు సర్వ సాధారణం. పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు వీటికి ‘సైక్లిక్ క్రైసిస్’ అని పేరు పెట్టి సైద్ధాంతీకరించేశారు కూడా. (అంటే సిద్ధాంతం కనక ఇక అడగొద్దని.) పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభం అంటే ప్రధానంగా పెట్టుబడిదారుల సంక్షోభమే. పెట్టుబడిదారులకు లాభాలు తగ్గిపోతే అదే సంక్షోభం. దేశంలో దరిద్రం తాండవిస్తున్నా అది సంక్షోభం కాదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, నూటికి యాభై మందికి ఇళ్ళు లేకపోయినా, నలభై మంది ఆకలితో, అర్ధాకలితో చస్తూ బతుకుతున్నా, మొత్తంగా ప్రజల జీవన…

పెట్టుబడిదారుల అక్రమ డబ్బు రు. 1155 లక్షల కోట్లు

ప్రపంచ దేశాలన్నింటికీ చెందిన ధనికులు దాచిన అక్రమ సొమ్ము విలువ 21 ట్రిలియన్ డాలర్లని ‘టాక్స్ నెట్ వర్క్ జస్టిస్’ (టి.ఎన్.జె) సంస్ధ చెప్పింది. ఈ సొమ్ము 1155 లక్షల కోట్ల రూపాయలకి (1 ట్రిలియన్ = లక్ష కోట్లు, 1 డాలర్ = 55 రూపాయలు) సమానం. ఇది కేవలం కనీస మొత్తం (conservative estimates) మాత్రమే. వాస్తవ మొత్తం 32 ట్రిలియన్ డాలర్లు (రు. 1760 లక్షల కోట్లు) ఉండవచ్చని సదరు సంస్ధ తెలిపింది.…