ఆర్మీ మందుగుండు డిపోలో పేలుడు, 17గురు సైనికులు ఆహుతి
మహారాష్ట్రలో భారత రక్షణ బలగాల ఆయుధాలకు మందుగుండు సరఫరా చేసే అతి పెద్ద మందుగుండు డిపోలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంగా చెబుతున్న దుర్ఘటనలో 17 మంది సైనికులు దుర్మరణం చెందారని పత్రికలు తెలిపాయి. మరణాల సంఖ్య 20 కి పెరిగిందని కొన్ని పత్రికలు చెప్పాయి. ప్రధాన మంత్రి యధావిధిగా ‘ట్విట్టర్’ ద్వారా తన ఆందోళన ప్రకటించారు. తన ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయని తెలిపారు. మృతులలో ఇద్దరు అధికారులు కాగా 15 మంది డిఫెన్స్ సెక్యూరిటీ…