మంగళయానం: చైనా ప్రశంసల జల్లు
అంగారక ప్రయాణాన్ని విజయవంతం చేసినందుకు ఇండియాపై చైనా ప్రశంసల వర్షం కురిపించింది. రష్యా కూడా ఇండియాను అభినందించింది. మంగళయానం విజయవంతం కావడం ఒక్క ఇండియాకు మాత్రమే గర్వకారణం కాదని ఆసియా ఖండానికి అంతటికీ గర్వకారణం అనీ చైనా ప్రశంసించడం విశేషం. మంగళయానం విజయం ద్వారా ఇండియా, చైనాకు అంతరిక్ష యానాంలో గట్టి పోటీదారుగా అవతరించిందని భారత పత్రికలు వ్యాఖ్యానించాయి. అయితే చైనా మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించింది. ఇండియా విజయం తన ఆసియా సహోదరుడి విజయం కనుక…
