కేరళ సినీ నటి పట్ల కాంగ్రెస్ ఎం.పి అసభ్య వర్తన

ఆయన పేరు ఎన్ పీతాంబర కురుప్. వయసు 73 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ద మనిషి. మళయాళంలో కురుప్ అంటే అర్ధం ఏమిటో తెలియదు గానీ తెలుగు అర్ధానికి తగినట్లుగా వ్యవహరించి వార్తలకెక్కాడు. అవడానికి పార్లమెంటు సభ్యుడే అయినా తాను నైతికంగా కురూపినే అని ఆయన నిరూపించుకున్నాడు. సినీ నటి శ్వేతా మీనన్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, అసభ్య కూతలు కూసి భారత పార్లమెంటు సభ్యులు కొందరు ఏ…