లిబియా దాడులతో స్పష్టమైన అమెరికా బలహీనత -న్యూ డెమొక్రసీ నాయకుడు

లిబియా పై పశ్చిమ దేశాలు తలపెట్టిన దాడుల ద్వారా అమెరికా బలహీన పడిందని రుజువైందని సి.పి.ఐ (ఎం.ఎల్ – న్యూ డెమొక్రసీ) నాయకులు పి. ప్రసాద్ అన్నారు. లిబియాపై పశ్చిమ దేశాలు జరుపుతున్న దుర్మార్గ దాడులకు నాయకత్వం వహించడానికి అమెరికా సంసిద్ధంగా లేదని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ల దురాక్రమణ యుద్ధాల్లో పీకల దాకా కూరుకు పోయి బైట పడలేక సంగతి మన కళ్ళ ముందున్నదనీ,…