సూర్యనెల్లి అత్యాచారం: రాజ్యసభ ఉపాధ్యక్షుడికి తాజా నోటీసులు
సూర్యనెల్లి సామూహిక అత్యాచారం కేసు రాజ్య సభ ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్ ను వదలకుండా వెంటాడుతోంది. బాధితురాలి పట్టు విడవని ప్రయత్నాలు కేరళ కాంగ్రెస్ నాయకుడికి రాజకీయంగా చివరి రోజులు ఖాయం చేసినట్లు కనిపిస్తోంది. తన పైన అత్యాచారం జరిపిన వారిలో ఒకరైన పి.జె.కురియన్ పైన పునర్విచారణ చేయాలని మార్చి నెల ఆరంభంలో బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్ ను పెరుమాదె జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు మార్చి 2 తేదీన కొట్టివేసింది. అయినప్పటికీ పట్టు విడవకుండా…